ప్రజాశక్తి- పంగులూరు : పంగులూరు మండలం కొండ మంజులూరు గ్రామంలోని రావుల జానకిరామయ్య పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను స్కౌట్స్ అండ్ గైడ్స్ బందాలుగా మంగళవారం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంచాలకుల ఉత్తర్వుల అనుసరించి ఈ బందాలు ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రధానోపా ధ్యాయురాలు ఇమ్మడిశెట్టి అనిత తెలిపారు. బాలుర స్కౌట్స్ బందానికి ‘స్టెల్లార్ స్కౌట్ యూనిట్’గా, బాలికల బందానికి ‘ఎలైట్ గైడ్స్ కంపెనీ’గా నామకరణం చేసినట్లు ఆమె చెప్పారు. బాలుర యూనిట్ కు స్కౌట్ మాస్టర్‌గా పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎం. వేణు, బాలికల యూనిట్‌కు గైడ్ కెప్టెన్‌గా క్రాఫ్ట్ ఉపాధ్యాయురాలు ఎన్. అనురాధ వ్యవహరిస్తారని చెప్పారు. స్కౌట్ బందాలు రాబోవు కాలంలో అవస రమైన సందర్భాల్లో సమాజానికి తమ సేవలను అందిస్తూ సేవా భావాన్ని సమాజంలో పెంపొందిం చేందుకు కషిచేస్తారని ప్రధానోపాధ్యాయురాలు అనిత తెలిపారు.
