ఘనంగా గురుస్థానం పాఠశాలల ఏడవ వార్షికోత్సవ వేడుకలు

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : గురుస్థానం పాఠశాలల ఏడవ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఉదయం మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (క్రైమ్‌) కె.లత మాధురి హాజరయ్యారు. ఈ సందర్భంగా లతా మాధురి మాట్లాడుతూ … ముఖ్య అతిథిగా రావడం గౌరవంగా భావిస్తున్నానని, తల్లిదండ్రులకు విలువైన సలహాలు ఇస్తూ తన ప్రసంగాన్ని తెలియచేశారు. అనంతరం గురుస్థానం డైరెక్టర్‌ ఎస్‌.ఖాన్‌ మాట్లాడుతూ … పాఠశాల ఏడో వార్షికోత్సవం జరుపుకోవడం అలాగే డీ.సీ.పీ.లతా మాధురి ముఖ్య అతిథిగా పాల్గొనడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు డ్యాన్స్‌, పాటలు పాడుతూ తమ ప్రతిభను కనబరిచారు, అలాగే పిల్లల తల్లిదండ్రులు ప్రదర్శనలు చేస్తూ తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ ఎస్‌.ఖాన్‌, గౌరవ అతిథిగా ఏసీపీ వెంకటరావు, ఏక్యూజే కళాశాలల వైస్‌ చైర్మన్‌ ఫారూఖీ, ఈడీ నిషా, ప్రిన్సిపాల్‌ గౌసియా బేగం, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️