మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలి

Jun 11,2024 22:39
ఫొటో : ర్యాలీ నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

ఫొటో : ర్యాలీ నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది
మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలి
– అర్బన్‌ పిహెచ్‌సి వైద్యాధికారిణి డాక్టర్‌ అస్మా
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : రానున్న వర్షాకాలంలో ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అర్బన్‌ పిహెచ్‌సి వైద్యాధికారిణి డాక్టర్‌ అస్మా పేర్కొన్నారు. మంగళవారం పిహెచ్‌సి కేంద్ర సిబ్బందితో కలసి మలేరియా వ్యతిరేక మాసోత్సవాల ర్యాలీ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దోమ కుట్టరాదు, దోమ పుట్టరాదు అనే నేనాదంతో పిహెచ్‌సి నుండి సోమశిల రోడ్డు సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలేరియా, డెంగీ, ఫైలేరియా, చికున్‌గున్యా మొదలైన వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, దానిపై వైద్యసిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మురుగునీరు నిల్వ ఉంటే వెంటనే తొలగించాలని సూచించారు. పనికిరాని గుంతల్లో వాడుకలలోని బావులను పూడ్చివేయాలన్నారు. మురుగు కాలువలో పూడికతీసి నీరు పారేలా చేయాలని తెలిపారు. మరుగుదొడ్లు, గాలి గొట్టాలకు మెష్‌లు కొట్టాలని సూచించారు. ప్రతి శుక్రవారాన్ని డ్రైడేగా పాటించి ఇంటలో నీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు. ఆమెవెంట ఎంపిహెచ్‌ఒఎస్‌ సుధాకర్‌, ఎంపిహెచ్‌ ఎస్‌.పార్వతి, వైద్యసిబ్బంది ఉన్నారు.

➡️