హిందూపురం పట్టణంలో ఘనంగా ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Dec 28,2024 16:11 #antapuram, #SFI

ప్రజాశక్తి – అనంతపురం : హిందూపురం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఐటిఐలో ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేతలు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి మాట్లాడుతూ 1970 కేరళ రాష్ట్ర రాజధాని త్రివేండ్రంలో అధ్యయనం పోరాటం నినాదంతో డిసెంబర్ 28, 29, 30, 31 వ తేదీలలో స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం, ఆశయాలతో అందరికీ ఉచితమైన విద్యని ప్రభుత్వాలు అందించాలని చదువుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్లతో ఏర్పడింది. ఆనాటి నుంచి నేటి వరకు అనేక నిర్బంధాలను కేసులను ఎదుర్కొని విద్యార్థుల సమస్యలు పరిష్కారానికి ఎన్నో పోరాటాలు నిర్వహించింది అని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ విద్యను నిర్వర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్య ప్రవేటీకరణకు కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాబావలి ఎస్ఎఫ్ఐ నాయకులు తరుణ్ పవన్ హసేన్ అఫ్రిద్ హుస్సేన్ మంజునాథ్ మూర్తితో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

➡️