నీట్‌ పరీక్ష ఫలితాలపై సమగ్ర విచారణ చేపట్టాలి : ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌

హిందూపురం (అనంతపురం) : 2024 నీట్‌ పరీక్ష ఫలితాలు – నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, నీట్‌ పరీక్ష నిర్వహణ తీరుపై సమగ్ర విచారణ నిర్వహించి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బాబావలి మంగళవారం మాట్లాడుతూ …. 2024 నీట్‌ పరీక్షల నిర్వహణ బాధ్యత చేపట్టిన ఎన్టిఏ వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నందున ఎన్టిఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) పారదర్శకత పరీక్ష నిర్వహణపై ప్రత్యేక దర్యాప్తు సంస్థలతో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. నీట్‌ పరీక్ష ఫలితాలలో ఒకే పరీక్ష కేంద్రం ఉన్న ఒకే సీరియల్‌ నెంబర్లతో కూడిన ఉన్న విద్యార్థులకు ర్యాంకులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు లక్షలాదిమంది విద్యార్థులు దీనిపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం కనుక నీట్‌ పరీక్ష నిర్వహణ ఎన్‌ టి ఎ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) వ్యవహరించిన తీరుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. నీటి పరీక్షల ఫలితాలపై అనేక గందరగోళాలు అనుమానాలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నందున పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జై చంద్ర ప్రదీప్‌, బాబా ఫక్రుద్దీన్‌, సుభాష్‌, హేమంత్‌, శశి కుమార్‌, వినరు, నాగరాజు, రోహిత్‌ పాల్గన్నారు.

➡️