లేపాక్షి (అనంతపురం) : లేపాక్షి మండలం చోళసముద్రం గ్రామం ప్రభుత్వ జడ్పీహెచ్‌ఎస్ స్కూల్ ఎదురుగా హైవేలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ … మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి, ఎస్‌ఎఫ్‌ఐ లేపాక్షి మండల కార్యదర్శి నందీశ్ మాట్లాడుతూ … నిన్నటి రోజు చోళసముద్రం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థికి రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిపారు. పాఠశాల ఎదురుగా ఉన్న రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కాబట్టి పాఠశాల ఎదురుగా ఉన్న రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించడం ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతుందన్నారు. ఇప్పటికైనా విద్యార్థులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పాఠశాల ఎదురుగా ప్రధాన రోడ్డులో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకపోతే ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులను కలుపుకొని స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసే వరకు పోరాటం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి నందీష్, ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు నితిన్, లోకేష్, అశ్వత్ నారాయణ పాల్గొన్నారు.