రాయదుర్గం (అనంతపురం) : భారత దేశ స్వాతంత్ర ఉద్యమ అమరవీరులను స్మరించుకుంటూ … రాయదుర్గం పట్టణంలో బుధవారం దాదాపు 3,000 మంది విద్యార్థులతో జాతీయ జెండా ర్యాలీ ప్రదర్శన జరిగింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బంగి శివ నాయకత్వంలో మొదలైన ర్యాలీ లక్ష్మీ బజార్ మీదుగా వినాయక కూడలి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బంగి శివ మాట్లాడుతూ …. దేశంలో భిన్న మతాలు, సాంప్రదాయాలు భిన్నత్వంలో ఏకత్వంగా భావించే గొప్ప దేశం మనది. ఇలాంటి దేశంలో 78వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా విద్యార్థులలో స్వాతంత్ర స్ఫూర్తిని నింపేందుకు ర్యాలీని చేపట్టినట్లు చెప్పారు. ఈ ర్యాలీలో సెయింట్ థామస్, వెంకటేశ్వర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ఏపీ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలకు చెందిన 3000 మంది విద్యార్థులు పాల్గన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు గౌతమ్, అరవింద్, ఆదర్శ, వలి, అనిల్, ఖలీల్, ఇర్ఫాన్, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.
