అనంతపురం : సంక్రాంతి సెలవు రోజులలో తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. శనివారం సంక్రాంతి పండుగ సందర్భంగా … ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల పది నుంచి 19వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది కానీ ప్రైవేట్ కార్పొరేటర్ విద్యాసంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులు కూడా ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు మానసిక ఆవేదనకు గురి చేస్తున్నారని అన్నారు ఈ రకంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజులలో తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామని లేనిపక్షంలో తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థల నందు ప్రత్యక్ష ఆందోళనలు ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.