ఎస్‌ఎఫ్‌ఐ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి- జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎద్దు రాహూల్, వీరపోగు రవిప్రజాశక్తి – కడప అర్బన్ అన్నమయ్య జిల్లా మదనపల్లె లో ఈ 17 నుంచి 26 వరకు నిర్వహించే ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎద్దు రాహుల్, వీరపోగు రవి పిలుపునిచ్చారు. బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రలో విద్య రంగ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం పై పోరాటానికి శ్రీకారం చుట్టాలని, అందుకు ప్రణాళిక ఏర్పాటు చేయడం కోసం మదనపల్లె రాష్ట్రం వేదిక కాబోతుందని తెలిపారు. రాష్ట్ర శిక్షణ తరగతులకు అన్ని జిల్లాల నుంచి 450 మంది ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నాయకులు హాజరు అవుతున్నారని చెప్పారు. 10 రోజులు ఈ శిక్షణా తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. క్లాస్‌లకు రాష్ట్రంలోని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు, విద్యావేత్తలు హాజరవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన 10 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో రాష్ట్ర విద్యా రంగంలో రోజురోజుకీ విద్యార్థులు సమస్యలు పుట్టుగొడుగుల పుట్టుకొస్తున్నాయని చెప్పారు. ఉన్నత విద్యలో డిగ్రీ మేజర్ మైనర్ సబ్జెక్టులు తీసుకు వచ్చిన పద్ధతిని రద్దు చేయాలని, పీజీ విద్యార్థులు స్కాలర్షిప్ ఎగొట్టేందుకు తీసుకువచ్చిన 77 జీవోను రద్దు చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచా లని, శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్స్ ను పునః ప్రారంభి ంచాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజ శేఖర్, సహాయ కార్యదర్శి అజరు, నగర ఉపాధ్యక్షులు శ్రీను పాల్గొన్నారు.
