ప్రజాశక్తి -బాపట్ల : పంచాయతీ రాజ్ గ్రామీణాభివద్ధి విస్తరణాధికారిగా పులి శరత్‌బాబు ప్రజలకు అందించిన సేవలు శ్లాఘనీయమైనవని ఎంపిడిఒ బి. బాబూరావు తెలిపారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శరత్ బాబు ఉద్యోగ విరమణ అభినందన సభ శుక్రవారం రాత్రి నిర్వహించారు. సభలో ఎంపిడిఒ మాట్లాడుతూ శరత్‌బాబు పంచాయతీ రాజ్ శాఖలో వివిధ హోదాల్లో 35 యేళ్ళ పాటు వత్తి పట్ల అంకిత భావం, నిజాయతీ నిబద్ధతతో పనిచేసి ప్రజలు, ప్రజా ప్రతినిధుల ఆధారాభిమానాలను చూరగొన్నారని కొనియాడారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులు, ఎంపిడిఒ కార్యాలయ సిబ్బంది శరత్ బాబు, పద్మలత దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ మోహనరావు, విద్యుత్ ఎఒ కోటేశ్వరరావు, మండల పరిషత్ కార్యాలయ పాలనాధికారి రజిని , పంచాయతీ కార్యదర్శి పల్నాటి శ్రీరాములు,పులి వాసు తదితరులు పాల్గొన్నారు.
