వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించిన షర్మిల

ప్రజాశక్తి-వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద కుమార్తె కాంగ్రెస్‌ పార్టీ పిసిసి చీఫ్‌ షర్మిలారెడ్డి ఘనంగా నివాళులర్పించారు. సోమ వారం జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించు కొనేందుకు మల్లెలమ్మపల్లెకు విచ్చేసిన పిసిసి చీఫ్‌, కడప పార్లమెంటు అభ్యర్థి షర్మిలారెడ్డి ఓటును వేసే ముందు తన తండ్రి వైఎస్‌ఆర్‌ సమాధి వద్దకు తన భర్త బ్రదర్‌ అనిల్‌తో కలిసి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మల్లెలమ్మపల్లెలో ఉన్న బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

➡️