ప్రజాశక్తి – వినుకొండ : పట్టణానికి చెందిన పరుగుల వీరుడు షేక్ అబ్దుల్లా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. గతనెల 24న 0.30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో జరిగిన 42 కిలో మీటర్ల మారథాన్‌లో ప్రతిభ చూపారు. ప్రతికూల వాతావరణం, అలవాటు లేని ప్రాంతంలో అనారోగ్యం పాలైనా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విజయవంతంగా ముగించాడు. భారతదేశం నుండి పాల్గొన్న 80 మందిలో ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించిన అబ్దుల్లా గడ్డ కట్టిన మంచుపై 42 కిలోమీటర్లను 06 గంటలలో పూర్తిచేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఆయన పేరును నమోదు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపాడు. ఈ నెల 29న ఎన్‌ఇబి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో బెంగళూరులో జరిగే 24 గంటల పరుగు పందెంలో 210 కిలోమీటర్ల ఎఎఫ్‌ఐ పరుగు పందెంలో పాల్గొనేందుకు ఇండియా రికార్డు కోసం ముందుకు వెళుతున్నట్లు తెలిపాడు. తనకు ఆర్థికంగా సహాయ, సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
