శిద్దా హనుమంతరావు షష్టిపూర్తి వేడుకలు

ప్రజాశక్తి-చీమకుర్తి: కష్ణ సాయి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త శిద్దా హనుమంత రావు, పుష్పలత దంప తుల షష్టిపూర్తి వేడుకలు ఘనంగా ప్రారంభ మయ్యాయి. సోమవా రం ఒంగోలు సంతపేట లోని షిరిడి సాయి ఆల యంలో షష్టిపూర్తి వేడు కలు ప్రారంభ మయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం గణపతి పూజ, పుణ్యాహ వచనము, సాయంత్రం దీక్ష కంకణ ధారణ, అఖండ స్థాపన, మహా మండపారాధన, దీపారాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం పూర్ణాహుతి హౌమం, షష్టిపూర్తి హౌమం, యాగాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు శిద్దా హనుమంతరావు పుష్పలత దంపతులను వేద పండితులు, పలువురు ప్రముఖులు ఆశీర్వదించారు. కష్ణ సాయి గ్రానైట్స్‌ అధినేత శిద్దా వెంకటేశ్వరరావు సూర్య కుమారి దంపతులు, శిద్దా భరత్‌ దంపతులు, యాపిల్‌ గ్రానైట్స్‌ అధినేత శిద్దా సూర్య ప్రకాష్‌ రావు జయశ్రీ దంపతులు, అర్చన రాజశేఖర్‌ దంపతులు, ఉదరు దంపతులు, నల్లూరి ఫౌండేషన్‌ అధినేత నల్లూరి వెంకట శేషయ్య, పారిశ్రామికవేత్తలు బంగారు రెడ్డి, వివా గ్రానైట్‌ అధినేత సి.నవీన్‌ కుమార్‌ రెడ్డి, కష్ణ సాయి గ్రానైట్‌ డాకా రామచంద్రారెడ్డి, టీవీ మురళీమోహన్రావు, జడ్పిటిసి వేమశ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసి గోగినేని వెంకటేశ్వర్లు, సిద్ధ నాగేశ్వరరావు, వాసవి గ్రానైట్స్‌ అధినేత శిద్దా పాండురంగారావు, శిద్దా ఆంజనేయ ప్రసాద్‌, శిద్దా పవన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️