స్ట్రాంగ్‌ రూం నుండి ఈవీఎంల తరలింపు

Apr 14,2024 00:16

ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట వినుకొండ రోడ్డులోగల వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లోని గోదాముల్లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ల (ఈవీఎం)లను తొలివిడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ అనంతరం నియోజకవర్గాల వారీగా తరలించే ప్రక్రియను శనివారం చేపట్టారు. తరలింపును జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు రాండమైజేషన్‌ ప్రక్రియకు సంబంధించిన పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, శ్రీరాములు పాల్గొన్నారు.

➡️