ఫొటో : విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఇఒ మస్తాన్‌వలీ
రిజిస్టర్లలో నమోదు చేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : స్వీయ మదింపు టర్మ్ -1 జవాబు పత్రాలను ఏ రోజుకారోజు మదింపు చేసి రిజిస్టర్లలో నమోదు చేయాలని ఎంఇఒ1 షేక్ మస్తాన్‌వలీ పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మాసాయిపేట మెయిన్, మాసాయిపేట హరిజనవాడ, మాసాయిపేట ఉర్థూ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వీయ మదింపు టర్మ్-1 పరీక్షల జవాబు పత్రాలను పరీక్ష అనంతరం ఈరోజుకారోజు మదింపు చేసి రిజిస్టర్స్‌లో నమోదు చేయాలని తెలియజేశారు. మూడు పాఠశాలలలో బోధన అభ్యసన సామగ్రిని చాలా చక్కగా తయారుచేసి విద్యాబోధన చేయుచున్న ఉపాధ్యాయునీయులైన జి.అనురాధ, షేక్ అర్షియా, షేక్ హాజీరలను అభినందించారు. మరుగుదొడ్లు, తరగతి గదులు శుభ్రం చేయడానికి ప్రభుత్వం వారు సరఫరా చేసిన రసాయనాలను ప్రతిరోజు తప్పనిసరిగా ఉపయోగిస్తూ తరగతి గదులు మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని మూడు పాఠశాలల ఆయాలకు తెలియజేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులలో కలసి భోజనం చేశారు. పరీక్షల అనంతరం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్‌లో మార్క్స్ నమోదు చేసి విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు.