ప్రజాశక్తి – కపిలేశ్వరపురం : వృత్తి విద్యా నైపుణ్యం పట్ల విద్యార్థులంతా ఆసక్తి పెంచుకోవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బాలికా విద్య అభివృద్ధి అధికారి ఎం. కె భీమారావు అన్నారు . కపీలేశ్వరపురం మండలం మాచర జెడ్ పి ఉన్నత పాఠశాలలో వృత్తి విద్యా కోర్సుల్లో భాగంగా మంగళవారం పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఇంటర్ని షిప్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతనెల 29 న నిర్వహించిన వృత్తి విద్యా పరీక్షకు పదవ తరగతి విద్యార్థులు హాజరయ్యారని, వీరికి పాఠశాల లోని వృత్తి విద్యా శిక్షకులు టి. లలిత, ఎస్ శ్రీనుబాబుల పర్యవేక్షణలో 12 రోజులపాటు ఇంటర్నిషిప్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు . కార్యక్రమంలో పాఠశాల హెచ్.ఎం. రమాదేవి, కోనసీమ జిల్లా వృత్తి విద్యా కోఆర్డీనేటర్ కె.రమేష్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, పాల్గొన్నారు.
