ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి

ప్రజాశక్తి-వెలిగండ్ల: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో షేక్‌ మహబూబ్‌ బాషా అన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎన్‌రోల్‌మెంట్‌ స్పెషల్‌ డ్రైవ్‌, బంగారు బాల్యం కార్యక్రమాలపై ఎంఈవో దాస్‌ప్రసాద్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ స్పెషల్‌ డ్రైవ్‌ ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమో దు శాతం పెంచడం, బడి మధ్యలో మానేసిన విద్యార్థుల ను తిరిగి చేర్పించడం, విద్యార్థులకు మంచి విద్యా సౌక ర్యాలు అందించడం, ప్రభుత్వ పథకాలు మరియు ప్రోత్సాహకాలను వివరించడం, విద్యార్థుల తల్లిదండ్రుల తో సమావేశాలు నిర్వహించి బడిలో చేర్చే విధంగా ప్రోత్సహించడం తదితర అంశాలపై అవగాహన కల్పిం చారు. బాలల హక్కుల పరిరక్షణ , బాల్య వివాహాలను నిరోధించడం, బాలికలు ఉన్నత స్థాయికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికా రులు దేవిరెడ్డి రామిరెడ్డి, కేజీబీవీ ప్రిన్సిపాల్‌ శ్రీరామ సుశీల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️