ప్రజాశక్తి-శింగరాయకొండ: అంగన్‌వాడీ కేంద్రాలలో నాణ్యమైన విద్యను అందించాలని, అంగన్‌వాడీ కార్యకర్తలకు రెండో రోజు శిక్షణలో భాగంగా సూపర్‌వైజర్లు సూచించారు. మంగళవారం నాడు శింగరాయకొండ మండలం ఊళ్లపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో అంగన్‌వాడీ కార్యకర్తల శిక్షణ తరగతుల్లో నాణ్యమైన విద్య మొదటి నుంచి పిల్లలకు నేర్పిస్తే ఆ విద్యలో ఎంతో ఉపయోగాలు ఉంటాయని సూచించారు. మూడు రోజులపాటు ఈ శిక్షణా తరగతులు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు ఎస్‌కె సైదాబీ, జ్యోతి, ఎస్‌కె రిజ్వానా తదితరులు పాల్గొన్నారు. కొండపి: పోషణ్‌బీ పడాయిబీ శిక్షణ కార్యక్రమంలో భాగంగా పిల్లల ఆరోగ్య స్థితిపై అవగాహన కార్యక్రమం సిడిపివో మాధవీలత ఆధ్వర్యంలో కొండపి జూనియర్ కళాశాలలో మంగళవారం నిర్వహించారు. ఈ శిక్షణను సూపర్‌వైజర్ విక్టోరియారాణి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. పొన్నలూరు: మండలంలోని ముండ్లమూరివారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం అంగన్‌వాడీ సూపర్‌వైజర్ రమాదేవి అధ్యక్షతన పోషణ్‌బి-పడాయిబిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సున్నా నుంచి మూడు సంవత్సరాల పిల్లలలో వారి యొక్క అభివృద్ధి మైలురాయిని గమనించడానికి నవచేతన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవచేతన కార్యక్రమం అనేది పిల్లల అభివద్ధి మైలురాళ్లును గమనించి ప్రతినెల నిర్వహించే కార్యక్రమాలలో పిల్లల తల్లిదండ్రులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పిల్లల గురించి తగిన శ్రద్ధ తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
