ప్రజాశక్తి-టంగుటూరు : విద్యార్థులు అందరూ కూడా ఆర్థిక అక్షరాస్యతపై, సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, బ్యాంకింగ్ సేవలపై పూర్తి అవగాహన కలిగి ఆర్థికంగా బలోపేతం కావాలని రమేష్ తెలియజేశారు. టంగుటూరు మండలంలో, శ్రీనిధి ఫిషరీస్ కళాశాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వర్క్ షాప్‌కు ముఖ్య అతిథిగా ప్రకాశం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ డి రమేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ విజయరత్నం మాట్లాడుతూ బ్యాంకులో లభించే వివిధ ఖాతాల గురించి, విద్యార్థులు చిన్నతనం నుంచే బడ్జెట్‌పై, ఆర్థిక ప్రణాళికపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ వర్క్‌షాప్ సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్‌ఫÛర్మేషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ వి ఆంజనేయులు, ప్రాజెక్ట్ మేనేజర్ వి అశోక్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించారు. రూడ్‌సెట్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, రిసోర్స్ పర్సన్లు అశోక్, శ్రీను, ట్రైనర్ డానియల్, టంగుటూరు కెనరా బ్యాంక్ మేనేజర్ సారంగధర మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
