ప్రజాశక్తి – బాపట్ల జిల్లా : కులవృత్తిదారులు ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం రాయితీపై అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు తెలిపారు. కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో బీసీ కుల వత్తుదారులతో గురువారం ఆధరణ పధకం ఫేస్ -3 రాయితీ రుణాల మంజూరు పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ స్వయం ఉపాధితో ఆర్థిక స్వలాభం కోసం రూ. లక్ష వరకూ రాయితీపై రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రుణాలకు అర్హులైన వారు రుణం మొత్తంలో 10 శాతం ముందుగా డిడి చెల్లించాల్సి ఉంటుందన్నారు. 10 శాతం డిడి పోనూ మిగిలిన 90 శాతం ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని జత చేసి ఆయా కుల వృత్తిదారులకు రుణ సదు పాయాన్ని కల్పిస్తారన్నారు. బీసీ కులాల నాయకులు తెలిపిన అభిప్రాయాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, బీసీ కులాల నాయకులు వెంకటేశ్వర్ల, చేజర్ల సతీష్, శ్రీనివాసరాజు, మారం రవికుమార్, జొన్నాదుల వెంకటేశ్వర్లు ,పిన్నిబోయిన వెంకటేశ్వర్లు, అగ్నికుల క్షత్రీయుల కార్పొరేషన్ డైరెక్టర్లు ముమ్మిడి రామకష్ణ, వి. వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమం సంఘం జిల్లా ఇన్‌ఛార్జి అధ్యక్షుడు బాపట్ల రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
