ప్రజాశక్తి-ఆనందపురం : జాతీయస్థాయి ఖోఖో పోటీలకు తమ పాఠశాల విద్యార్థిని రేగాని శృతిక ఎంపికైందని సిర్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిఇటి బుత్తల సత్యం తెలిపారు.ఈ నెల 22 నుండి 25 వరకు గుంటూరు జిల్లా కారంపుడిలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ -14 ఖోఖో పోటీల్లో పాఠశాలకు చెందిన నలుగురు విధ్యార్థులు రేగాని శృతిక, సారిక పవిత్ర, యర్ర హరిణి పాల్గొన్నారని, వీరు మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో తృతీయస్థానంలో నిలిచారన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శృతిక వచ్చే నెలలో మధ్యప్రదేశ్‌లో జరిగే జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో ఆంధ్రా జట్టు తరుపున పాల్గొంటుందన్నారు. ఖోఖోలో ప్రతిభ చూపిన విద్యార్థులు, పిఇఒసత్యంను హెచ్‌ఎంతోపాటు, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ కోరాడ గౌరి, వైస్‌చైర్మన్ సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ సిర్ల అప్పలనాయుడు, ఎంపిటిసి బోని అప్పలనాయుడు, మాజీ చైర్మన్ బూర్లి వెంకటరమణ, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయలు అభినందించారు.
విద్యార్థులను అభినందిస్తున్న పిఇటి