ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రం ఆయన నార్పల మేజర్ పంచాయతీ కార్యదర్శిగా శ్యామల శనివారం బాధ్యతలు స్వీకరించారు నార్పల పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న అస్వర్త నాయుడు బదిలీల్లో భాగంగా యాడికి పంచాయతీకి బదిలీ కాగా చెన్నై కొత్తపల్లి కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న శ్యామల సాధారణ బదిలీల్లో భాగంగా నార్పల పంచాయతీ కార్యదర్శి గా వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ … గ్రామ ప్రజలు, సర్పంచ్, పంచాయితీ పాలకవర్గ సభ్యులు, సచివాలయ సిబ్బంది, ఉన్నతాధికారులు అందరి సహకారంతో సమన్వయంతో మేజర్ పంచాయతీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. పంచాయితీ పరిధిలో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
