నంద్యాల అర్బన్ (నంద్యాల) : నంద్యాల స్థానిక పద్మావతి నగర్ లో న్యూక్లియస్ జూనియర్ కాలేజీ ఎదురుగా నూతనంగా నూనెపల్లె మాజీ కౌన్సిలర్ మంచాల విజయభాస్కర్ రెడ్డి అల్లుడు గూడ అమర్నాథ రెడ్డి ఏర్పాటు చేసిన కుందన్ సిల్వర్ జ్యువలరీ షాప్ ను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి , టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్‌ఎండి ఫయాజ్ , మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ …. సిల్వర్ జ్యువలరీలో తక్కువ ధర కి నాణ్యతతో కూడిన జ్యువలరీ ఇక్కడ లభిస్తుందని, మంచి మంచి డిజైన్స్ కోసం కర్నూలు హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం లేదని అలాంటి డిజైన్స్ నంద్యాలలో కూడా కుందన్ సిల్వర్ జ్యువలరీలో లభించును అని ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాంపల్లె రామిరెడ్డి , కేఎల్ దీపక్ రెడ్డి , మంచాల అవినాష్ రెడ్డి , అశోక్, చాంద్ రెబల్, తదితరులు పాల్గొన్నారు.
సిల్వర్ జ్యువలరీ షాప్ ప్రారంభించిన ఎంపీ బైరెడ్డి శబరి, యువ నాయకులు ఎన్‌ఎండి ఫయాజ్
