కొమ్మాదిలో సిల్వర్‌ ఓక్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌

Jun 9,2024 23:18 #silver oak school branch
silver oak school branch

ప్రజాశక్తి -పిఎం పాలెం : జివిఎంసి ఆరో వార్డు పరిధి కొమ్మాది విలేజి సమీపంలో సిల్వర్‌ ఓక్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఐదో బ్రాంచి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్స్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీతామూర్తి మాట్లాడుతూ, విద్యార్థుల్లో వ్యక్తిత్వం ముందు, పోటీ ఆ తర్వాతే అన్న నినాదమే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. ఇంటర్నేషనల్‌ ప్రమాణాలతో కూడిన చదువు, ఏడు నుంచి పదో తరగతి వరకు సిబిఎస్‌సి కోర్సు అందిస్తున్నామని తెలిపారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌ ధనుంజరురావు మాట్లాడుతూ, సంస్థ 22 సంవత్సరాల నుంచి నడుస్తుందన్నారు. 22 మందితో ప్రారంభమైన సంస్థ నేడు పది వేల మంది విద్యార్థులతో దిగ్విజయంగా ముందుకు వెళుతుందని తెలిపారు. విద్యార్థుల కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ బాగున్నాయని తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిల్వర్‌ ఓక్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ డైరెక్టర్లు శ్రీనివాసరావు, కార్తీక్‌ పాల్గొన్నారు.

➡️