ప్రజాశక్తి – రాయచోటి శ్రీరాముడి చరితమును సామాన్యులకు సైతం అర్థమయ్యే భాషలో సరళంగా రాసిన ఘనత కవయిత్రి మొల్లది అని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. గురువారం స్థానిక రాయచోటి కలెక్టరేట్‌లో జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెసి, డిఆర్‌ఒ మధుసూదన్‌రావు హాజరై పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ కడప జిల్లా గోపవరం గ్రామంలో కుమ్మరి కుటుంబంలో జన్మించిన ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి అన్నారు. ఆమె రచనా శైలి చాలా సరళం, రమణీయమన్నారు. తాళ్లపాక తిమ్మక్క తర్వాత చెప్పుకోదగ్గ రెండవ తెలుగు కవయిత్రి మొల్ల అని కీర్తించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సురేష్ మాట్లాడుతూ శ్రీ కష్ణదేవ రాయలు సమయంలో ఈమె రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిందన్నారు. మొల్ల రామాయణం ఆరు కాండాలలో 871 పద్యాలతో రచించారని చెప్పారు.. ఈ కావ్యాన్ని మొల్ల కేవలం ఐదు రోజులలో రాశారని చెప్పారు. ు. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధంగా వాడుక భాషకు దగ్గరగా ఉందని తెలిపారు. అంతకుమునకు రాయచోటి బంగ్లా సర్కిల్ దగ్గర ఉన్న మంగళ విగ్రహానికి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ మధుసూదన్‌రావు, జాతీయ బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డివిటి పద్మా యాదవ్, జిల్లా శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షులు నాగేంద్ర, లీగల్ అడ్వయిజర్ భద్రయ్య, కలెక్టరేట్ ఎఒ నాగభూషణం పాల్గొన్నారు. రాయచోటి టౌన్ : తెలుగుజాతి విలువైన రత్నం కవ యిత్రి మొల్ల అని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పట్టణం వైసిపి కార్యాలయంలో కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి సంస్కత భాషలో రచించిన రామాయణాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా తెలుగుభాషలో రచించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాం త్‌రెడ్డిని కుమ్మర శాలివాహన సంఘం వారు సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, వైఎస్‌ఆర్ సిపి జిల్లా ఉపాధ్యక్షుడు పల్లపు రమేష్, శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర, గౌరవాధ్యక్షుడు మెదరపల్లె సుబ్బయ్య, కౌన్సిలర్లు కసిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, షబ్బీర్, బిసి సెల్ అధికార ప్రతినిధి విజయభాస్కర్, సుగవాసి శ్యామ్, వాల్మీకి సంఘ అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, రియాజర్ రెహమాన్, జానం రవీంద్ర యాదవ్, చిన్న సంజీవయ్య, మహేష్‌రెడ్డి, నాజర్, అశోక్, జగన్, చంద్ర పాల్గొన్నారు. నందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో కవయిత్రి మొల్ల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయలలిత కుమారి ఆధ్వర్యంలో తెలుగు ఉపాధ్యాయులు గంగనపల్లి వెంకటరమణ, గీత, రమణమ్మలు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఖాదర్ బాషా, శిల్పి ఆనందాచారి, జీవి ప్రసాదరావు, రవిశంకర్ రెడ్డి, నాగిశెట్టి లక్ష్మీనారాయణ, బోగా వెంకటసుబ్బయ్య, మస్తాన్, తులసీ స్వర్ణలత, జ్యోతి ప్రియ, విజయ కుమారి, ఆర్. వి. రమణమ్మ, గౌరీ, ప్రమీల రాహేల్ పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్ :వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కతం నుండి తెలుగులోకి ఐదు రోజుల్లో అందరికీ అర్థమయ్యే విధంగా వచన కావ్యంగా రచించిన తొలి తెలుగు మహిళ కవయిత్రి శ్రీకుమ్మర్ల మొల్ల అని జిల్లా కుమ్మర శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షులు గోవింద రాజులు అన్నారు. సొసైటీ కాలనీలో మదనపల్లి డివిజన్ కుమ్మర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో మొల్ల జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జడ్‌పిటిసి, సంఘం గౌరవ అధ్యక్షులు రంగప్ప, కార్యదర్శి గంగులప్ప, రాష్ట్ర ప్రచార కార్యదర్శి సి.శ్రీనివాసులు, పట్టణ కమిటీ ప్రతినిధులు శంకర, కృష్ణమూర్తి, వెంకట నారాయణ, భాస్కర్, రమేష్, మురళి, లోహిత్ సాయి పాల్గొన్నారు.
