సాదాసీదాగా మండల సమావేశం

మండల సమావేశం

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో చర్చలు, తీర్మానాలు లేకుండానే ముగింపు

ప్రజాశక్తి -అనంతగిరి : ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి చర్చలు, తీర్మానాలు, ప్రతిపాదనలు, ఆమోదాలు, ప్రసంగాలు లేకుండానే స్థానిక మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగిసింది. గురువారం ఎంపిపి శెట్టి నీలవేణి అధ్యక్షతన జరిగిన 11వ మండల సభలో జెడ్‌పిటిసి దీసరి గంగరాజు మాట్లాడుతూ, పోలింగ్‌ ముగిసినప్పటికీ, ఫలితాలు వెలువడేవరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటున్న నేపథ్యంలో ఎటువంటి తీర్మానాలు, ప్రతిపాదనలకు అస్కారం లేదన్నారు. ఈ నేపథ్యంలో సమావేశంలో సమస్యలపై చర్చ జరగకున్నా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులంతా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ఫలితాల వెలువడిన తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరోమారు సమావేశమై అధికారులు, నేతలంతా సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలను శాంతియుతంగా,పకడ్బందీగా నిర్వహణకు శ్రమించిన అధికార యంత్రాంగానికి మండల ప్రజా ప్రతినిధుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపిడిఒ నగేష్‌, మండల కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ మదీనా, ఎంపిటిసిలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు

మండల సభలో మాట్లాడుతున్న జెడ్‌పిటిసి గంగరాజు

➡️