సింహపురి సాంస్కృతిక ఉత్సవాలు..!
తమ్మారెడ్డి భరద్వాజ్
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి
సిపిఎం 27వ రాష్ట్ర మహాసభల సందర్భంగా సింహపురి సాంస్కృతిక ఉత్సవాలు ఈనెల 27,28,29 తేదీల్లో నిర్వహించనున్నారు. నగరంలోని ముత్తుకూరు గేట్ సెంటర్‌లో కామ్రేడ్ రుద్రరాజు సత్యనారాయణ రాజు కళా ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు సినీ దర్శకులు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గాయకులతో ఆలాపన, రేబాల కళాకారుల డప్పుల విన్యానం, నెల్లూరు సిటి నుంచి పండరి భజన, నేలటూరి పాళెం నుంచి జడకోలాటం, శాస్త్రీయ నృత్యాలు, నాగరాజ ఈవెంట్స్ డాన్స్, ఆర్‌టిసి కాలనీ వారి వేమన రూపకం, సుందరయ్య నగర్ వారి జనం కోసం, దామరమడుగు వారి రైతు నాటిక, చిన్న పిల్లల నృత్యాలు నిర్వహిస్తారు. 28 వతేదీ రెండో రోజు మాజీ ఎంఎల్‌సి విటపు బాలసుబ్రమణ్యం, ఐద్వారాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఆలాపన, 15వ డివిజన్ నుంచి డప్పుల విన్యాసం, ఒంగోలు నుంచి కోలాటం, నెల్లూరు సిటి జడకోలాటం, శాస్త్రీయ నృత్యాలు, కళాంజలి ఆర్కెస్ట్రా, నెల్లూరు సిటి జానపద నృత్యాలు, యల్లాయపాళెం గిరిజన నృత్యం, బుజబుజ నెల్లూరు వారి ఆయా రే మే డే డాన్స్, శ్రీధర్ మాట్లాడే బొమ్మ, బుజబుజ నెల్లూరు వారి పాడుదమా స్వేచ్చాగీతం, ప్రజా రోగ్య వేదిక తియ్యటి ముప్పు, రాష్ట్ర కేంద్రం నుంచి ఏ కులం నీదిన నాటిక నిర్వహించనున్నారు. 29 వతేదీ మూడో రోజున తెలంగాణ ఎంఎల్‌సి, ప్రజా వాగ్గేయకారులు గోరంటి వెంకన్న సీనియర్ రంగ స్థల నటి రేబాల శ్రీలక్ష్మీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఆలాపన, డప్పుల విన్యాసం, జోసఫ్‌పేట వారి కోలాటం, ఆత్మకూరు నుంచి ఏకలవ్య నృత్య రూపకం, శాస్త్రీయ నృత్యాలు, సుందరయ్య కాలనీ వారి సెల్యూట్ సుంరదయ్య , చిట్టిబాబు డాన్స్ ఈ వెంట్స్, వీర తెలగాణ నాటిక, పద్యనాటకం నిర్వహించనున్నారు. మూడ్రోజులపాటు జరిగే ఉత్సవాలకు ఆహ్వాన సంఘం ఏర్పాట్లు చేస్తుంది.
