CPI(M) – ఉద్యమాలకు ఊపునిచ్చే సింహపురి సాంస్కృతిక ఉత్సవాలు – ఫోటోలు

నెల్లూరు : సిపిఐ(ఎం) రాష్ట్ర మహాసభల సందర్భంగా … సాంస్కృతిక ఉత్సవాలు రెండవ రోజున బుధవారం ముత్తుకూరు గేట్‌ సెంటర్లో ప్రారంభమయ్యాయి. సిపిఎం జిల్లా సెక్రటేరియట్‌ సభ్యులు ఎస్కే రెహనా బేగం అధ్యక్షతన జరిగిన సభలో మాజీ శాసన మండలి సభ్యులు బాలసుబ్రమణ్యం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.రమాదేవిలు ముఖ్య అతిథులుగా ప్రసంగించారు. నెల్లూరు జిల్లా పోరాటాల పురిటి గడ్డ అని, సుందరయ్య, జక్కా వెంకయ్య లాంటి ప్రజా పోరాట సారధులు జన్మించిన ఈ గడ్డపై రాష్ట్ర మహాసభలు జరగడం సంతోషకరంగా ఉందని అన్నారు. ప్రజా పోరాటాలను రూపొందించి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఈ మహాసభల తోడ్పడతాయని ఆశించారు. సాంస్కృతిక ఉత్సవాలలో ప్రజల సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రజా ఉద్యమాలకు ఊపునిచ్చే విధంగా కళారూపాలు ప్రదర్శిస్తున్నారని, కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు మంగరాజు, జిల్లా అధ్యక్షులు వేణు, తదితరులు ప్రసంగించారు. అనంతరం కళారూపాలను ప్రదర్శించారు. కళారూపాలు ప్రజలను విశేషంగా ఆకర్షించాయి.

➡️