మాట్లాడుతున్న నాయకులు
నేటి నుంచి ‘సింహపురి’ సాంస్కృతికోత్సవాలు
ప్రజాశక్తి-నెల్లూరుఫిబ్రవరి 1,2,3 తేదీల్లో మూడు రోజుల పాటు నగరంలో సిపిఎం రాష్ట్ర 27వ మహాసభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు ముత్తుకూరు గేట్ సెంటర్‌లో సింహపురి సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్ అనిల్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్‌లో సాంస్కృతిక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన పాల్గొని సింహపురి సాంస్కృతిక ఉత్సవాల వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహాసభల సందర్భంగా రాష్ట్రంలోని గ్రామీణ వాతావరణ సాంస్కృతిక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్య పరిచేందుకు ఈఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలల్లో రాష్ట్రానికి చెందిన పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు పాల్గొని ప్రదర్శనలు ఇస్తారన్నారు. మూడు రోజుల ఉత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో మొదటి రోజు కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హాజరై ప్రారంభిస్తారన్నారు. మూడో రోజు కార్యక్రమాలకు తెలంగాణ ప్రజా వాగ్గేయకారులు, ఎంఎల్‌సి గోరేటి వెంకన్న పాల్గొని కళా ప్రదర్శనలను ప్రారంభిసా ్తరన్నారు. దేశంలో ఉన్న విభిన్న కులాలు , మతాలకు చెందిన సాంస్కృతినంతా ఈ ఉత్సావాలల్లో ప్రదర్శిం చనున్నట్లు తెలిపారు. మతోన్మాద పార్టీలు కుల, మతాల మధ్య విభేదాలు సృష్టించి, ప్రజల మద్య భేదాభిప్రాయాలను నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. రాష్ట్రానికి దేశంలోనే ఒక ప్రముఖమైన గుర్తింపు ఉందని,జానపద, హరికథలకు పేరుగాంచిన ప్రాంతంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మద్య చిచ్చుపెట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తుందన్నారు. ఆ ప్రయత్నాలను ఎప్పటికప్పడు అడ్డుకుంటూ ప్రజలను చైతన్య పరుస్తున్నది సిపిఎం ఒక్కటేనన్నారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ మాట్లాడుతూ నగరంలో సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకోని మూడు రోజుల పాటు సాంస్కృతిక జాతర జరుగుతుందన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ముందుగా సింహపురి సాంస్కృతిక ఉత్సవాలు వివరాలతో రూపొం దించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సాంస్కతిృక కమిటీ కన్వీనర్ ఎం.పుల్లయ్య, శ్రీనియ్య, విజరుకుమార్, రెహనాబేగం పాల్గొన్నారు.
