ఎంఎస్‌ఎంఇ పార్కు ఏర్పాటుకు స్థల పరిశీలన

Oct 11,2024 19:34

 ప్రజాశక్తి-విజయనగరంకోట :  రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలతో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఎంఎస్‌ఎంఇ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ఎంఎస్‌ఎమ్‌ఇ సెర్ప్‌, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని విజయనగరం రూరల్‌ మండలం గోపాలపురం వద్ద అందుబాటులో ఉన్న 15 ఎకరాల స్థలంలో స్వయం సహాయక సంఘాల ఎంఎస్‌ఎంఇ పార్క్‌ ఏర్పాటు కోసం మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌, ఎమ్మెల్యే అదితి గజపతి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. గోపాలపురం వద్ద 19.5 ఎకరాల స్థలం అందుబాటులో ఉండగా ఇందులో ఐదు ఎకరాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం కేటాయించారని, మిగతా 14.5 ఎకరాల స్థలంలో ఎంఎస్‌ఎంఇ పార్క్‌ ఏర్పాటు చేయవచ్చని కలెక్టర్‌ తెలిపారు. స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ పర్యటనలో సెర్ఫ్‌ సిఇఒ జి.వీరపాండ్యన్‌ జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ సేతు మాధవన్‌, ఆర్డీవో దాట్ల కీర్తి, తహశీల్దార్‌ కూర్మనాధరావు, డిఆర్‌డిఎ పీడీ ్‌ కళ్యాణ్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️