ప్రజాశక్తి -అచ్యుతాపురం : జన విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో అచ్యుతాపురంలో ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఆదివారం జిల్లాస్థాయి చెకుముఖి పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలో వివిధ పాఠశాలలకు చెందిన 160మంది విద్యార్థులు హాజరుకాగా, ప్రతిభ కనబరిచి విజేతలైన ఆరుగురు విద్యార్థులను వచ్చేనెల 9,10 తేదీల్లో విశాఖలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు చీడికాడ మండలం అప్పలరాజుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జె గుణశ్రీ నవ్యశ్రీ, బి.దివ్య, శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలు విద్యార్థులు సాయి శ్రవణ్, ఎంఎస్‌వి సాత్విక్, ఎస్ కిరణ్ కుమార్ ఎంపికయ్యారు. విజేతలకు జెవివి రాష్ట్ర ఉపాధ్యక్షులు త్రిమూర్తులురెడ్డి సర్టిఫికెట్లు మెమెంటోలు ఇచ్చి సత్కరించారు. పోటీలను జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు త్రిమూర్తులు రెడ్డి పి రంగరాజు ఎం శేషగిరిరావు పర్యవేక్షించారు. కార్యక్రమంలో జెవివి అనకాపల్లి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగచంద్ర, మారిశెట్టి వెంకట అప్పారావు, రమేష్ వర్మ, శ్రీరామమూర్తి, దొర, మల్లేష్ లింగం, జిల్లా కార్యదర్శి బొడ్డేడ రామ్‌కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రమణ పాల్గొన్నారు
విజేతలకు బహుమతులు ఇస్తున్న త్రిమూర్తులు రెడ్డి