డీప్‌ బోరుతో నీటి సమస్యకు పరిష్కారం

ప్రజాశక్తి-కనిగిరి కనిగిరి పట్టణంలో వేసవిలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపడుతున్నామని కనిగిరి మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ అన్నారు. గురువారం కనిగిరి పట్టణంలోని 4,5 వార్డుల్లో మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ పర్యటించి ప్రజలను ప్రత్యక్షంగా సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో నీటి సమస్య వచ్చే ప్రాంతాలను ముందుస్తూ గుర్తించి నీటి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 4,5వ వార్డులో డీప్‌-బోర్‌ ద్వారా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ దేవరాజు, వైసీపీ నాయకులు నరసయ్య, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

➡️