ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా రెండు రోజులపాటు జరగబోయే సౌత్ జోన్ -2 రీజినల్ కాన్ఫరెన్స్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ పి.ఎస్. నరసింహ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ అనిరుద్ధ బోస్, ఝార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్ర రావు, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి. నరేందర్ లు కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కాన్ఫరెన్స్ లో సౌత్ జోన్ పరిధిలోని వివిధ కోర్టుల న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు భాగస్వామ్యమయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, ఇతర న్యాయమూర్తులు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
విశాఖలో సౌత్ జోన్ -2 రీజినల్ కాన్ఫరెన్స్ ప్రారంభం
