భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు : ఎస్‌పి

ప్రజాశక్తి -కలకడ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్న భూములను స్థానికులు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌పి విద్యాసాగర్‌ నాయుడు అన్నారు. శుక్రవారం పోలీసుస్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్‌కు సంబంధించిన పరిసర భూములను పరిరక్షించుకోవడంలో ప్రభుత్వం నిబంధనలు విధించిందని తెలిపారు. వాటిని అతిక్రమించి స్థానికులు ఎవరైనా పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్న భూములను ఆక్రమించిన అనుభవించాలని ఆలోచన వచ్చిన వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసు సిబ్బంది చర్యలు తీసుకొని స్టేషన్‌ ఆవరణ భూములను పరిరక్షించడంలో పాత్ర వహించాలన్నారు. రెవెన్యూ వారు స్టేషన్‌ పరిధిలో ఉన్న భూములను పరిరక్షించే క్రమంలో సర్వే చేసి మాకు సహకరించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది సమయపాలన పాటించి విధులకు హాజరు కావాలని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, రోడ్డు భద్రత నియమాలను పాటించే విధంగా సిబ్బంది పనిచేయాలని తెలిపారు. మండలంలో చోరీలు పేకాట నియంత్రణకు చర్యలు నాటు సారా తయారీ అమ్మకాలను నియంత్రించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డిఎస్‌పి కృష్ణమోహన్‌, తహశీల్దార్‌ ఫణి కుమార్‌, సిఐ గురునాథ, ఎస్‌ఐ రామాంజనేయులు, సర్వేయర్‌ దేవి, పోలీస్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

➡️