బాధితుల సమస్యలు పరిష్కరించాలి : ఎస్‌పి

Oct 7,2024 21:48

ప్రజాశక్తి-విజయనగరంకోట : సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో 48 మంది బాధితులు తమ సమస్యలపై వినతులు ఇచ్చారు. ఈ ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించినవి 21, కుటుంబ కలహాలకు సంబంధించి 3, మోసాలకు పాల్పడినట్లుగా 11, ఇతర విషయాలకు సంబంధించినవి 13 ఫిర్యాదులు ఉన్నాయి. వారి సమస్యలను విన్న ఎస్‌పి వాటి పరిష్కారానికి ఆయా స్టేషన్ల పోలీసు అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, పరిష్కారానికి చట్ట పరిధిలోచర్యలు చేపట్టి, న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పి పి.సౌమ్యలత, ఎస్‌బి సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్‌విఆర్‌కె చౌదరి, డిసిఆర్‌బి ఎస్‌ఐ రాజేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

➡️