ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : రక్తదానం మరొకరికి ప్రాణదానమని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసే ప్రాణదాతలు కావాలని ఎస్వీ తుహిన్ సిన్హా పేర్కొన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మేజర్ పంచాయతీ కశింకోట సామాజిక భవనం లో మెగా వైద్య శిబిరాన్ని. సిఐ స్వామినాయుడు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ తుహిన్ సిన్హా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రక్తదాన శిబిరాలను మా డిపార్ట్మెంట్ తరఫున ప్రోత్సహిస్తామని అన్నారు. శిబిరం లో ఎక్కువమంది రక్తదానం చేసే విధంగా నిర్వాహకులు కృషి చేయాలన్నారు. శిబిరాన్ని డిఎస్పీ బి. అప్పారావు , ఎస్సై లక్ష్మణరావు నిర్వహణకు సహకరించారు. ఈ శిబిరంలో ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ , సంజీవని బ్లడ్ బ్యాంక్, విశాఖ వెంకటరమణ హాస్పిటల్, ఎన్టీఆర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది వారి సేవలు అందజేశారు. సిఐ స్వామి నాయుడు పోలీస్ సిబ్బంది యువకులు కలిపి సుమారు 100 మందికి పైగా రక్తదానం చేశారు.హొ హొ ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.