గుండెపోటుతో మరణించిన హెచ్ కానిస్టేబుల్ చలపతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎస్పీ

Nov 29,2024 18:18 #Chittoor

ప్రజాశక్తి – బైరెడ్డిపల్లి : బైరెడ్డిపల్లిపోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ, 29-09-2024 వ తేదిన అనారోగ్యంతో హెచ్ సి 300 ఇ.టి.వి. చలపతి మరణించారు. ఆయన సతీమణి రమాదేవి గురువారం విడో ఫండ్ నుండి రూ.50,000 వేలు, ఫ్లాగ్ ఫండ్ నుండి రూ.25,000 ఎస్పీ వి.ఎన్.మణికంఠ చందోలు, చిత్తూరు పోలీస్ ఆఫీస్ ఏ.ఓ నాగభూషణమ్మ, క్లర్క్ పార్ధ సారధి నాయుడు సమక్షంలో చిత్తూరు పోలీస్ కార్యాలములో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, పోలీస్ శాఖ తరపున వారికి అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ డిపార్టుమెంటు తరపున కుటుంబానికి అందాల్సిన ప్రయోజనాలు ఆలస్యమవ్వకుండా చూస్తామని, ఏవైనా సమస్యలు ఉంటే నిరభ్యంతరంగా ఎస్పీ సంప్రదించవచ్చని తెలిపారు

➡️