ఎ.ఎ.ఎన్‌.ఎమ్‌, వి.వి.ఆర్‌.ఎస్‌.ఆర్‌ హై స్కూల్‌ లో స్పేస్‌ ఆన్‌ వీల్స్‌ కార్యక్రమం

గుడ్లవల్లేరు (కృష్ణా) : ఇస్రో, విజ్ఞాన భారతి సంయుక్తంగా నిర్వహిస్తున్న స్పేస్‌ ఆన్‌ వీల్స్‌ కార్యక్రమమును బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఇద్దరు వైస్‌ ప్రిన్సిపాల్స్‌ డా. పి. కోదండ రామారావు , డా. ఎమ్‌.ఆర్‌.సి.హెచ్‌. శాస్త్రిగారు పాల్గని కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్ధులు సైన్స్‌ పట్ల అవగాహన, ఆసక్తి కలిగించేందుకు ఈ కార్యక్రమం స్కూల్‌ లో ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన 2024 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మిద్దె శ్రీనివాసరావు విద్యార్ధులకు శాస్త్ర, సాంకేతిక విషయాలపట్ల ఎలా అవగాహన చేసుకోవాలో తమ అమూల్యమైన సందేశంతో చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు మొత్తం 330 మంది విద్యార్థులు మరియు ఎస్‌.ఇ.ఆర్‌.ఎమ్‌. హై స్కూల్‌ నుండి 50 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గోని మన దేశం ప్రయోగించిన వివిధ శాటిలైట్స్‌, వాటి ఉపయోగాలు పి.ఎస్‌.ఎల్‌.వి, జి.ఎస్‌.ఎల్‌.వి. మొదలగువాటి గురించి తమ అవగాహనను పెంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సాతులూరి లీనా, వైస్‌ ప్రిన్సిపాల్‌ జి.ఎమ్‌. సత్యబాబు ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు..

➡️