ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్‌ అడ్మిషన్‌ డ్రైవ్‌ : యుటిఎఫ్‌ మండల అధ్యక్షుడు అద్దరి

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించుటకు స్పెషల్‌ అడ్మిషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు యుటిఎఫ్‌ మండల శాఖ అధ్యక్షుడు అద్దరి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలోని కండ్రికపేట ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు ఆవాస ప్రాంతము నందు పిల్లలను గుర్తించేందుకు డ్రైవ్‌ లో ఆయన పాల్గన్నారు. ఈ క్రమంలో 5 గురు బాలలను గుర్తించి ఒకటవ తరగతిలో పాఠశాలలో చేర్పించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్‌ చేయాలని, బడి బయట పిల్లలు అందరూ కూడా బడిలోనే ఉండాలని , ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న తల్లికి వందనం, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, విద్యార్థి మిత్రలపై అవగాహన కల్పించి తల్లిదండ్రులను చైతన్య పరిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిల్లి రాంబాబు, సిఆర్‌ఎంటి వెంకట జ్యోతి, అంగన్వాడి టీచర్స్‌ వరలక్ష్మి, మణి పాల్గొన్నారు.

➡️