తాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి

Jun 11,2024 21:35

ప్రజాశక్తి – భోగాపురం: నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కార దిశగా ప్రత్యేక దృష్టి చేస్తామని జనసేన నాయకులు కాకర్లపూడి శ్రీనివాసరాజు అన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు భోగాపురంలోని ఆయన కార్యాల యంలో ఆయనకు మంగళవారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎమ్‌పి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టి సారిస్తామన్నారు. దీనిపై జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో మాట్లాడతామని అన్నారు. తీర ప్రాంతంలోని మత్స్యకారులకు కూడా తాగునీటి ఇబ్బందులు తీరుస్తామన్నారు. గతంలో ఎన్‌డిఎ ప్రభుత్వం లోనే తాగునీటి ప్రాజెక్టులు వచ్చాయన్నారు. ఇప్పుడు కూడా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అవసరమైన ప్రాజెక్టులను ఎమ్మెల్యే సహకారంతో తీసుకువస్తామన్నారు. ఎల్‌ఈడి స్క్రీన్‌ల ద్వారా ప్రమాణ స్వీకారంభోగాపురం గ్రామంలోని కళ్యాణ మండపంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఎల్‌ఇడి స్క్రీన్‌పై ప్రత్యక్ష ప్రసారం వేయనున్నట్లు శ్రీనివాసరాజు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. తెలుగు దేశం, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని ఆయన తెలిపారు. ఆయన్ను కలిసిన వారిలో ఆ పార్టీ నాయకులు మైలపల్లి నరసింహులు, కర్రోతు శ్రీనివాసరావు, మొక్క కృష్ణారెడ్డి, బలరాం తదితరులు ఉన్నారు.

➡️