ప్రజాశక్తి – కడప వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలపై ప్రత్యేక దష్టి సారించి తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో వేసవిలో పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి అవసరాల సన్నద్ధతపై సంబంధిత మున్సిపల్, ఇంజినీరింగ్ అధికా రులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిని ద ష్టిలో ఉంచుకుని పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాలకు ఎలాంటి కొరత లేకుండా తాగునీటి సదుపాయం, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నీటి కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. మార్చి 20వ తేదీ లోపు పులివెందుల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాల్లో సమద్ధిగా తాగునీరు అందేలా పెండింగ్‌లో ఉన్న తాగునీటి సరఫరా పనులను పూర్తి చేయాలన్నారు. అందుకు సంబంధించి చేపట్టాల్సిన పనులకు ప్రతిపా దనలను అందజేసి త్వరితగతిన పనులను పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అధిక నీటి ఎద్దడి పరిస్థితులు లేకపోయినప్పటికీ ఈ వేసవిలో అన్ని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు సరిపడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళికలను రూపొందించాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ, ప్రాంతాల్లో తాగునీటి అవసరాలతో పాటు రూరల్ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. జల్‌జీవన్ మిషన్ ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి పులివెందుల మున్సిపాలిటీకి తాగునీరందించే పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పులివెందుల ఆర్డీవో చిన్నయ్య, ఆర్ డబ్ల్యుఎస్ ఎస్‌ఇ వీరన్న, ఇఇ విజరు భాస్కర్, పులివెందుల మున్సిపల్ కమిషనర్ రాముడు, ఇఇ చిదానంద రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఇఇ రమణమూర్తి పాల్గోన్నారు.
