భువనేశ్వర్‌-యలహంక మధ్య ప్రత్యేక రైళ్లు

May 15,2024 23:38 #summer special trains
summer special trains

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ వేసవి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భువనేశ్వర్‌-యలహంక మధ్య వేసవి పత్యేక రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 02811 భువనేశ్వర్‌-యలహంక ప్రత్యేక రైలు జూన్‌ 1 నుంచి 29వ తేదీ వరకు ప్రతి శనివారం రాత్రి 19.15 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 01.53 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 01.53 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 23.55 గంటలకు యలహంక చేరుకుంటుంది. 02812 యలహంక-భువనేశ్వర్‌ ప్రత్యేక రైలు జూన్‌ 3 నుంచి జులై 1వ తేదీ వరకు ప్రతి సోమవారమూ ఉదయం 05.00 గంటలకు యలహంకలో బయలుదేరి, మరుసటి రోజు 04.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 04.32 గంటలకు బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 12.15 గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లు ఖుర్దా రోడ్డు, బ్రహ్మాపూర్‌, పలాస, శ్రీకాకుళం రోడ్‌, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, నంద్యాల, డోన్‌, ధర్మవరం, భువనగిరి సత్యసాయి ప్రశాంతి నిలయం మీదుగా ప్రయాణిస్తాయి.

➡️