వైద్య కళాశాల పనులను వేగవంతం చేయండి

వైద్య కళాశాల పనులను వేగవంతం చేయండి

-జిల్లా కలెక్టర్‌ ఎఎస్‌ దినేష్‌ కుమార్‌

ప్రజాశక్తి- పాడేరు : పాడేరులో మెడికల్‌ కళాశాల పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎఎస్‌ దినేష్‌ కుమార్‌ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గురువారం మెడికల్‌ కళాశాల పనులను పరిశీలించిన కలెక్టర్‌ నిర్మాణాల పట్ల సంతృప్తి వ్యక్త పరిచారు. మెడికల్‌ కళాశాల భవనంలో పూర్తి కానున్న తరగతి గదులు, అనాటమీ, బయో కెమిస్ట్రీ, హిస్టాలజి ల్యాబ్స్‌, ఆఫీస్‌ గదులు, మ్యూజియం, డైనింగ్‌, వసతి గహాలు తదితర నిర్మాణాలను పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి క్లాసుల నిర్వహణకు అప్పగించాలని ఆదేశించారు. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఈ ఏడాది నుండే ఎంబిబిఎస్‌ తరగతులకు అనుమతించిన నేపధ్యంలో కలెక్టర్‌ మెడికల్‌ కళాశాల నిర్మాణాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వేగావంతానికి చర్యలు తీసుకుంటున్నారు. పరిశీలనలో కళాశాల ప్రిన్సిపాల్‌ డా. హేమలత, ఎపిఎస్‌ఎంఐడిసి కార్యనిర్వాహక ఇంజనీర్‌ అచ్చెం నాయుడు, డిఇఇ వర్మ, ఎఇఇ సురేష్‌, డిజిఎం మధుబాబు పాల్గొన్నారు.

➡️