ప్రజాశక్తి-రాయచోటి మంగంపేట నిర్వాసితులకు పునరావాస పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మంగంపేట బెరైట్స్ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా ఎపిఎండిసి అధికారి మంగంపేటలో గల బెరైట్స్ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ అంశాలను కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్, మంగంపేట బెరైట్స్ ప్రాజెక్టు నిర్వాసితులకు చేపడుతున్న పునరావాస పెండింగ్ పనుల గురించి ఆర్‌అండ్‌బి, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, తదితర శాఖలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని వారిని ఆదేశించారు. భూ సేకరణ మరియు పట్టాల పంపిణీలో ఏవైనా పెండింగ్ పనులు ఉంటే త్వరగా వాటిని పూర్తి చేయాలని డిఆర్‌ఒ, తహశీల్దార్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, డిఆర్‌ఒ సత్యనారాయణరావు, రాజంపేట ఆర్‌డిఒ మోహన్‌రావు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ సహదేవరెడ్డి, హౌసింగ్ పీడీ సాంబశివయ్య, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారి ప్రసన్నకుమార్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ అధికారి దయాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
