కమ్యూనిస్టు నాయకుల ఆత్మీయ సమావేశం

Apr 17,2024 16:45 #krishna

పెనమలూరు : దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి సంపన్నులకు దార దత్తం చేసిన మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం  జిల్లా కమిటీ సభ్యులు పంచకర్ల రంగారావు కోరారు.పెనమలూరు నియోజకవర్గ ఇండియా కూటమి అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్‌ ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం పెనమలూరులో కిలారు వెంకటరత్నం అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షులు ధనేకుల మురళీమోహన్‌ రావు మాట్లాడుతూ ఎన్‌ డి ఏ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే కేంద్రంలో ఇండియాకుటమని గెలిపించాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు. మున్నంగి నరసింహారావు మాట్లాడుతూ కుల మతాల మధ్య చిచ్చు పెట్టి అభివఅద్ధి అనే పదాన్ని అటక ఎక్కించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపాలని కోరారు..సిపిఎం నాయకులు మస్తాన్‌ వలి మాట్లాడుతూ గత ప్రభుత్వం మధ్యపాన నిషేధం చేస్తానని వాగ్దానం చేసి పిచ్చిపిచ్చి బ్రాండ్లను ప్రజల ఆరోగ్యాలతో చలగాటం ఆడుతుందని వారికి బుద్ధి చెప్పాలని కోరారు. పెనమలూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిశాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీజేపీ అంటే బాబు జగన్‌ పవన్‌ అని వారికి ఎవరికీ వోట్‌ వేసిన అది బిజెపి ఖాతాలోకే వెళుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు త్రిమూర్తులు ,కాంగ్రెస్‌ పెనమలూరు మండల అధ్యక్షులు అరికట్ల సురేష్‌ కంకిపాడు మండలం రాజశేఖర్‌ వర్మ ఉయ్యూరు మండలం బాలాజీ నాయక్‌ , కొసనం రాము, కైలే సునీల్‌ , రాజేష్‌ మహిళ నాయకురాలు కీర్తి, సిహెచ్‌. భవాని మహిళా నాయకురాలు పుసులూరి పాతాళ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️