ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక పరిశీలన

ఏరియా ఆసుపత్రిని పరిశీలిస్తున్న మలేరియా శాఖ రాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ సుబ్రహ్మనేశ్వరి

ప్రజాశక్తి-రంపచోడవరం

రాష్ట్ర మలేరియా శాఖ అదనపు డైరెక్టర్‌ డాక్టర్‌ బి.సుబ్రహ్మనేశ్వరి మంగళవారం స్థానిక ఏరియా ఆసుపత్రిని మంగళవారం సందర్శించి పరిశీలన చేశారు. మలేరియా విభాగంలో స్లయిడ్స్‌ ఎలా ఉన్నాయి? నెలకు మలేరియా కేసులు ఎన్ని వస్తున్నాయి? పాజిటివ్‌లు ఎన్ని? నెగిటివ్‌లు ఎన్ని? వైద్య సేవలు ఎలా అందిస్తున్నారు? వైద్య పరీక్షలు ఎలా జరుగుతున్నాయి? తదితర వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. ఏరియా ఆసుపత్రి మలేరియా ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఐ.నాగ భూషణంను సెంట్రల్‌ మలేరియా ల్యాబ్‌ టెక్నీషియన్‌ యంవి.లక్ష్మి సుభద్ర మిగతా వివరాలు అడిగి తెలుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఒ పిఎస్‌ ప్రసాద్‌, ఆఫీస్‌ ఇన్‌ఛార్జి సిహెచ్‌.శ్రీనివాస్‌ రాజు, డివిబిడి కన్సల్టెంట్‌ యం.చంటిబాబు, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ టివివి.సత్యనారాయణ, కుమార్‌, వాసు, అడ్మినిస్ట్రేషన్‌ విభాగం యం.కృష్ణ, ఆర్‌యంఓ ఇందిరా తదితరులు పాల్గొన్నారు.

➡️