ఆరోగ్య, దేహదారుఢ్యంకి క్రీడలు అవసరం : డీఈవో భాష

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : బాల బాలికల ఆరోగ్యంతో పాటు దేహ దారుఢ్యంకి, మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరమని డిస్ట్రిక్ట్‌ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌(డిఈవో) ఎస్కే.సలీం భాష అన్నారు. కోనసీమ క్రీడా ఉత్సవాల ఆటలలో భాగంగా మండలంలోని కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుచున్న ఆటల పోటీలను బుధవారం ఆయన సందర్శించారు. అలాగే విద్యార్థుల ఆటల పోటీలతో ముచ్చటించి సంతఅప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులతోపాటు మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఆటల పోటీల్లో పాల్గొనడం వలన మంచి మేధాశక్తి కలిగి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బి.అప్పాజీ, మండల క్రీడల అధికారి సత్తిబాబు, పిఈటి గంగవేణి, ఉపాధ్యాయులు, సచివాలయ పోలీసులు, హెల్త్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️