ప్రజాశక్తి -పులివెందుల రూరల్ రాష్ట్రంలోని క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇస్తామని, క్రీడా శాఖలో ఉన్న దొంగ సర్టిప ˜ికెట్లను రూపుమాపుతామని రాష్ట్ర క్రీడా శాఖ, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. బుధవారం పులివెందుల పట్టణంలోని వైఎస్‌ఆర్ హాకీ క్రీడా మైదానంలో సౌత్ జోన్-2 హాకీ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు క్రీడా సంఘ సభ్యులు, క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు. క్రీడాజ్యోతి వెలిగించి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం హాకీ స్టిక్‌తో బాలును కొట్టి క్రీడలను ప్రారంభించారు. పోటీల్లో కేరళ, తమిళనాడు, తెలంగాణా, ఎపి, పుదుచ్చేరి, కర్నాటక నుంచి క్రీడా కారులు పాల్గొన్నారు. క్రీడలు ఈనెల 17 వరకు నిర్వహిస్తారు. చివరి రోజు విజేతలకు మెడల్స్, కప్పు, మెమో ంటోలతోపాటు సర్టిఫికెట్లు ప్రదా నం చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. విద్యతోపాటు క్రీడలపై కూడా దష్టి పెట్టాలని, ప్రతి ఉద్యోగంలో స్పోర్ట్స్ కోటా కూడా ఉంటుందని చెప్పారు. సర్టిఫికెట్లతో ఎంతోమంది ఉద్యో గాలు కూడా పొందారని అన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో క్రీడా శాఖ మంత్రి ఎవరో కూడా తెలియని పరిస్థితి మనకు ఉండేదని పేర్కొన్నారు. ఐదేళ్ల వైసిపి పాలనలో సుమారు రూ.130 కోట్లు క్రీడల కోసం దుర్వినియోగం చేశారని తెలిపారు. ప్రస్తుతం ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వంలో క్రీడల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి పేద క్రీడాకారునికి ఉపయోగిస్తామని ఒక్క రూపాయిని కూడా దుర్వినియోగం చేయమని చెప్పారు. 22 మంది కోచ్‌లకు సుమారు ఏడు నెలలు వేతనాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం వారిని ఇబ్బంది పెట్టిందని పేర్కొన్నారు. తాము వచ్చిన 35 రోజుల లోపల వారికి జీతాలు అందించామని తెలిపారు. ప్రస్తుతం క్రీడలపై యువత ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని, వారికి మెరుగైన శిక్షణ ఇచ్చే విధంగా అన్ని చర్యలు చేపడతామని అన్నారు. ఇటీవల తార ఒలింపిక్స్‌లో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎంతోమంది ఎక్కడికి వెళ్లి పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎటువంటి తప్పులు జరగకుండా క్రీడాకారులకు మంచి నైపుణ్యాన్ని అందించడం లక్ష్యంగా ముం దుకు వెళ్తామని ఉద్ఘాటించారు. కేంద్ర బడ్జెట్‌లో కూడా క్రీడలకు నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రానికి రావాల్సి వాటాను కూడా తీసుకొని వచ్చి మరింత క్రీడలను అభివద్ధి చేస్తామని అన్నారు. క్రీడలకు సంబంధించి దొంగ సర్టిఫికెట్ల సంగతి తేలుస్తానని చెప్పారు. దీనికి సంబంధించి త్వరలో కమిటీని వేస్తామని, ఈ సర్టిఫికెట్లు తీసుకొని కొంతమంది ఉద్యోగాలు కూడా చేస్తున్నారని వారి భరతం పడతామని పేర్కొన్నారు., రాష్ట్రంలో అవసరమైన ప్రతి చోటా క్రీడామైదానాలు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, టిడిపి పులివెందుల నియోజ కవర్గం ఇన్‌ఛార్జి బిటెక్ రవి మాట్లాడుతూ పులివెం దుల పట్టణంలో రెండోసారి హాకీ క్రీడలు జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరిన్ని క్రీడలు ఇక్కడ జరిగే విధంగా చూస్తా మని అన్నారు. తాము చదువుకునే రోజుల్లోనూ హాకీ ఆడేవారమని చెప్పారు. చివరగా మంత్రికి, ఎమ్మెల్సీ భూమి రెడ్డికి, పులివెందుల ఇన్‌ఛార్జి బిటెక్ రవికి క్రీడా సంఘ సభ్యులు సత్కరించి పూల బొకేలను అందిం చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హాకీ సిఇఒ నిరంజన్‌రెడ్డి, సెక్రెటరీ హర్షవర్ధన్, ట్రెజరర్ థామస్ పీటర్, కడప హాకీ సెక్రటరీ శేఖర్, టిడిపి, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
