ప్రజాశక్తి – ఆలమూరు : ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని ఆలమూరు భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు మంగళవారం ఆటల పోటీలు నిర్వహించారు. మండల విద్యా శాఖాధికారులు భమిడిపాటి అప్పాజీ, ఎస్.వి.సుబ్బరాజు ముఖ్య అతిధులుగా హాజరై ఆటల పోటీలను పర్యవేక్షించారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజేతలైన విద్యార్థులకు దాతలు సమకూర్చిన బహుమతులను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓలు మాట్లాడుతూ దివ్యాంగులు అందరూ ఆత్మస్థైర్యంతో మెలగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందన్నారు. విద్యార్థులందరూ శ్రద్ధా శక్తులతో విద్యను అభ్యసించి భవిష్యత్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ బూసి విద్యాప్రసన్న, భవిత ఉపాద్యాయులు జి.విజయ, ఇ.సత్య కిరణ్, సీఆర్పీలు ఎ.జ్యోతి, పి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.