ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పోలీస్ వర్క్ అంటే టీమ్ వర్క్‌అని, ఆ టీం వర్క్ స్పోర్ట్స్ ద్వారా కూడా సాధ్యమవుతుందని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. నరసరావుపేట పట్టణంలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో జిల్లా వార్షిక పోలీస్ స్పోర్ట్స్ – గేమ్స్ మీట్ పోటీలు-2024ను ఎస్పీ శనివారం ప్రారంభించి మాట్లాడారు. ఓటమిని, కష్టాన్ని భరించే శక్తిని ఆటలిస్తాయని, పోలీసులకు ఇటువంటి క్రీడా ఉత్సవం ఎంతో అవసరమని అన్నారు. ఆదివారం వరకూ సాగే స్పోర్ట్స్ మీట్‌లో కబడ్డీ, వాలీబాల్, పుట్‌బాల్, అథ్లెటిక్, 100 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్ల పరుగుపందెం, హైజంప్, లాంగ్ జంప్, క్రికెట్, టెన్నీస్, షటిల్ మొదలగు క్రీడలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) జె.వి. సంతోష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ వి.సత్తిరాజు, డీఎస్పీ పాల్గొన్నారు.